ఏపీలో కొత్తగా 381 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా కేవలం 381 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 934 మంది కోలుకొని డిశ్చార్జికాగా నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,68,064కు చేరింది. ఇవాళ్టి వరకు 8,53,232 మంది కోలుకున్నారు. మరో 7,840 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా 6992 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 40,728 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,00,57,854 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.