ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 61,038 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 618 కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గురు బాధితులు చనిపోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ బారినపడిన వారిలో 785 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,73,457కు చేరింది. ఇవాళ్టి వరకు 8,61,153 మంది కోలుకున్నారు. మరో 5,259 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్ల కారణంగా 7045 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 56,187 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,05,70,843 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.