ఏపీలో కొత్తగా 6,224 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,861కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 6,224 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 7,798 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,51,791గా ఉంది. కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 41 మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5941కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 55,282 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 11.84 శాతంగా ఉంది.
కృష్ణా 6, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు 3, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో 890, చిత్తూరు 827, తూర్పుగోదావరి జిల్లాలో 824, ప్రకాశం జిల్లాలో 619 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 60.21 లక్షల కరోనా టెస్ట్‌లు చేశారు.
