ఏపీలో కొత్తగా 6,555 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో కొత్త‌గా 6,555 క‌రోనా పాటిటీవ్ కేసులు, 31 మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,06,790కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 7,485 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,43,993గా ఉంది. కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5900కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 56,897 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 59,48,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 11.88 శాతం ఉంది.
కోవిడ్ కార‌ణంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, తూర్పు గోదావ‌రి, అనంత‌పురంలో న‌లుగురు, చిత్తూరు, క‌ర్నూలు, విశాలో ముగ్గురు, గుంటూరు, ప్ర‌కాశం, ప‌. గోదావ‌రి జిల్లాల్లో ఇద్ద‌రు, క‌డ‌ప‌, శ్రీ‌కాకుళం, జిల్లాలో్ల ఒక్కొక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు.

 

Leave A Reply

Your email address will not be published.