ఏపీలో కొత్తగా 667 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 667 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా 9 మంది చనిపోయారు. 914 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 60,329 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 667 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
ఇప్పటి వరకు కోలుకొని 8,59,,029 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 7,033 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,910 కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,04,10,612 కరోనా సాంపుల్స్‌ని వైద్య ఆరోగ్యశాఖ పరీక్షించింది.
జిల్లాల వారీగా తాజా కొవిడ్-19 మరణాలు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, వైఎస్‌ఆర్ కడప, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కో వ్యక్తి చొప్పున మృత్యువాతపడ్డారు.