ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,76,949 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,896 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,140 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 36,091 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.