ఏపీలో కొత్తగా 1,657 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1,657 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. ఏడుగురు బాధితులు మృతి చెందారు. మొత్తం 79,823 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,657 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,52,955కు చేరింది. కొత్తగా ఏడుగురు కరోనా బాధితులు మృతిచెందడంతో ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 6,854కు పెరిగింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
కాగా, గత 24 గంటల్లో 2,155 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,26,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,757 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 91,01,048 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మరణించిన కరోనా బాధితుల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.