ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 30 కరోనా పాజటివ్‌గా కేసులు నమోదయ్యాయి. 18,834 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు నమోయ్యాయి అని సోమవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే 24 గంటల్లో కరోనా బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. అలాగే తాజాగా మరో 69 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,899కి చేరుకంది. అలాగే రికవరీ కేసులు 8,81,041కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 7,163 మంది మృతిచెందారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.