ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 438 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 64,236 నమూనాలను పరీక్షంచగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,78, 723 కి చేరింది. ఇందులో 8. 67 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,202 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7076 కి చేరింది.