ఏపీలో కొత్త‌గా 479 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,215 కరోనా పరీక్షలు నిర్వహించగా 479 మందికి పాజిటివ్‌గా తెలింది. కోవిడ్‌ వల్ల చిత్తూరు, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 497 మంది కోవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,11,96,574 శాంపిల్స్‌ను పరీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.