ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 500 కొత్త కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,76,336 కు చేరింది. ఇందులో 8,64,612 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,660 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,064 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 19, చిత్తూరులో 88, తూర్పుగోదావరి జిల్లాలో 47, గుంటూరులో 55, కడపలో 34, కృష్ణాలో 77, కర్నూలులో 09, నెల్లూరులో 22, ప్రకాశంలో 26, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 63 కేసులు నమోదయ్యాయి.