ఏపీలో కొత్త‌గా 510 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 67,495 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 510 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా మ‌రో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 8,75,025కి చేరింది. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 7,052 మంది కోవిడ్‌తో మృతి చెందారు. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 665 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,62,895కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.