ఏపీలో కొత్త‌గా 663 కరోనా కేసులు

అమ‌రావ‌తి: ఏపీలో గత రెండురోజులతో పోలిస్తే ఇవాళ కరోనా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 663 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,159 మంది కోలుకొని డిశ్చార్జికాగా ఏడుగురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,69,412కు చేరింది.

ఇవాళ్టి వరకు 8,55,485 మంది కోలుకున్నారు. మరో 6,924 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా 7003 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 41,547 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 1,01,66,696 శాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల‌ వారీగా చూస్తే అనంతపురంలో 34, చిత్తూరులో 106, తూర్పుగోదావరి జిల్లాలో 60, గుంటూరులో 86, కడపలో 29, కృష్ణాలో 117, కర్నూలులో 5, నెల్లూరులో 34, ప్రకాశంలో 15, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 96 కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.