ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా కేవలం 81 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా బారినపడిన వారిలో 263 కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,86,066 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 8,77,212 మంది చికిత్సకు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27,861 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
