ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

అమరావతి : ఏపీలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో 61,112 మందికి పరీక్షలు చేయగా.. 3,224 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజులో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్‌ అవుతున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,58,951 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 43,983 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 32 మంది ప్రాణాలు విడువడంతో.. ఆ మొత్తం సంఖ్య 6256 కు చేరింది. తాజా పరీక్షల్లో 36,702 ట్రూనాట్‌ పద్ధతిలో, 24,410 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని వెల్లడించింది. ఇప్పటివరకు 66,30,728 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.

ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, అనంతపురంలో ఇదివరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యేవి.. కానీ ఇప్పుడు ఈ జిల్లాల్లో కరోనా ఉధృతి చాలా వరకూ తగ్గింది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 32 మంది మృతిచెందారు. కృష్ణా, ప్ర‌కాశం జిల్లాలో ఐదుగురు చొప్పున‌, గుంటూరు, క‌డ‌ప న‌లుగురు చొప్పున‌, అనంత‌పురం, తూర్పుగోడావ‌రి జిల్లాల్లో ముగ్గురు చొప్పున‌, ప‌శ్చిమ‌గోదావ‌రి 2, క‌ర్నూలు, నెల్లూరు, శ్రీ‌కాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ఒక్కొక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు.

 

Leave A Reply

Your email address will not be published.