ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అవగా.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్‌ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌ విభాగంతో 1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్‌, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

2 Comments
  1. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు says

    అభినందనలు

  2. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు says

    Congrats

Leave A Reply

Your email address will not be published.