ఏపీ కొత్తగా 75 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 34,864 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా వైజాగ్లో ఒకరు కరోనాతో చికిత్ప పొందుతూ మృతిచెందారు. తాజాగా 133 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350. కాగా ఇప్పటి వరకు కరోనాతో చికిత్ప పొందుతూ 7,159 మంది మృతిచెందారు.