ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత

వెంటనే స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

ఏలూరు: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు వ‌న్‌టౌన్ ప‌రిధిలో స్థానికులు ఒక్ససారిగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వ‌న్‌టౌన్ ప‌రిధిలోని ప‌డ‌మ‌ర వీధి, ద‌క్షిణ వీధి ప్రాంతాల్లో క‌ళ్లు తిర‌గ‌డం, వాంతులు వంటి లక్ష‌ణాల‌తో దాదాపు 27 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు వారిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు, వైధ్యులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని బాధితుల‌ను ఏటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే పెద్ద సంఖ్య‌లో అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డానికి గ‌ల కార‌ణ‌లు తెలియ‌రాలేదు.

మెరుగైన చికిత్స అందిస్తాం : మంత్రి ఆళ్ల నాని
పడమరవీధికి చెందిన కొంతమంది ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారని, వారందరిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఇప్పటి వరకు 48 మంది ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ఒక పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించామని మంత్రి వెల్లడించారు. మిగతా 22 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారన్నారు.

 

 

 

1 Comment
  1. […] ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత […]

Leave A Reply

Your email address will not be published.