ఏలూరులో త్రాగునీరు సుర‌క్షిత‌మే..

నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదు: ఎయిమ్స్

ఏలూరు: ప‌శ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తాగునీరు సురక్షితంగానే ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు. తాగునీటి శాంపిల్స్‌లో ప్రమాదకరమైనవి లేవని స్పష్టం చేశారు. 16 తాగునీటి శాంపిల్స్‌ను పరిశీలించగా.. ఒక శాంపిల్‌లో మాత్రమే లెడ్‌ మోతాదు ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్ప‌డు బాధితుల గురించి తెలుసుకుంటున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర వైద్య బృందాలు, నిపుణులు, అధికారులతో మాట్లాడారు. కేంద్ర బృందాల నివేదికలోని విషయాలను ముఖ్యమంత్రికి నిపుణులు వివరించారు.

కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరుకు వ‌చ్చిన సంగతి తెలిసిన‌దే.‌ వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్‌ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు ప్రస్తుతం ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగతులను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నాయి.

కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ..నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని ఎయిమ్స్‌ నివేదిక ఇచ్చిందన్నారు. గాలి, నీటిలో లెడ్‌, నికెల్‌ ఎక్కువ మోతాదులో లేవని తెలిపారు. ఆహార పదార్ధాల్లో మెర్క్యురీ ఉన్నట్లు తేలిందన్నారు. తాగునీరులో ఆర్గానో క్లోరిన్‌ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.