ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి కరోనా

ఒంగోలు: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో దవాఖానలో చేరారు. ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8,78,285 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,355 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 8,66,856 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 7074 మంది మరణించారు. రాష్ట్రంలో నిన్న 479 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.