ఒకే కాలేజిలో 25 మంది విద్యార్థులకు కరోనా

బెంగళూరు: కర్ణాటకలోని ఓ కళాశాలలో 25 మంది విద్యార్థులు కరోనా సోకింది. దీంతో అధికారులు కళాశాలను 14 రోజుల పాటు మూసివేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. విద్యాసంస్థ‌ల పునఃప్రారంభంలో భాగంగా సోమ్‌వర్‌పేట తాలూక పరిధిలో గ‌ల‌ గారాగండురులోని మొరార్జీ దేశాయ్‌ పీయూ కళాశాలలో ఈ నెల 11 నుంచి క్లాసులు నిర్వహిస్తున్నారు. కాగా రోజు 76 మంది విద్యార్థుల వ‌ర‌కు క్లాసుల‌కు హాజరవుతున్నారు. కాగా వీరందరికీ త‌ర‌గ‌తులు మొద‌లైన తొలిరోజుల్లో కొవిడ్ టెస్టు చేయ‌గా నెగెటివ్‌ వచ్చింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 21న ఆ విద్యార్థుల్లో ఒకరికి జ్వరం రావ‌డంతో కొవిడ్‌ పరీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆ విద్యార్థికి కొవిడ్ సోకిన‌ట్లు తేలింది. దీంతో మిగ‌తా విద్యార్థులందరికీ కొవిడ్ నిర్ధార‌ణ పరీక్షలు చేయించగా 25 మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింద‌ని అధికారులు బుధవారం తెలిపారు. ఉన్న‌తాధికారుల సూచ‌న మేర‌కు కాలేజికి రెండు వారాల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.