ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం!

వేలూరు: తమిళనాడులోని వేలూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓ బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.