ఒకే దేశంపై ఆధారపడొద్ద‌ని కోవిడ్ తెలియ‌జెప్పింది: మోడీ

న్యూఢిల్లీ : ఇండియా- డెన్మార్క్ వర్చువల్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా చైనాపై విరుచుకుపడ్డారు. ఈ స‌మ్మిట్ సోమ‌వారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్‌రిక్సెన్ పాల్గొన్నారు. ప్ర‌పంచంలోని చాలా దేశాలు ఉత్పత్తుల విషయంలో ప్రపంచం మొత్తం ఒకే దేశంపై ఆధారపడితే ఎంత ప్రమాదమో కోవిడ్ మ‌హ‌మ్మారి అందిరికి తెలిసి వ‌చ్చేలా చేసింద‌ని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇండియా.. జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి పలు ర‌కాలు ఒప్పందాల‌తో ముందుకు సాగుతున్నామ‌ని, మాతో క‌లిసి వ‌చ్చే దేశాలు రావొచ్చని మోడీ ప్ర‌పంచ‌దేశాల‌ను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడ్‌రిక్సెన్ పెళ్లిరోజును పురస్కరించుకొని ప్రధాని శుభాంకాంక్షలు తెలిపారు. ఇందుకు ప్రతిగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు భారత్‌ను మరోసారి సందర్శించాలన్న ఉత్సుకతతో ఉందని ఆమె మోడీ దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డ తరువాత భారత్‌కు తప్పక ఆహ్వానిస్తామని ప్ర‌ధాని ప్రకటించారు. కాగా భారత్, చైనా మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటున్న నేప‌థ్యంలో మోడీ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.