ఒక్క అవకాశం ఇవ్వండి : కోదండరాం

భూపాలపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీ.జే.ఎస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని టి.జే.ఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భవన్ లో ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోయిన ఆరు సంవత్సరాల లో ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఇప్పటికే భూపాలపల్లి లో గల ఓపెన్ కాస్ట్ లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఓపెన్ కాస్ట్ ల వల్ల జరిగే నష్టాన్ని గురించి ప్రభుత్వానికి నివేదిస్తమని తెలిపారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం కానుందని తెలిపారు.