ఓటు అడిగే హక్కు టిఆర్ఎస్‌కే ఉంది
ఐదేళ్లలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వరదలతో నష్టపోయిన వారిని సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోంది. గాంధీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా పద్మానరేశ్‌తో కలిసి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్‌ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
‘గత ఎన్నికల్లో 6వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గాంధీనగర్ డివిజన్‌ను గెలుచుకున్నాం. ఐదేళ్లలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. బీజేపీ అబద్దాలు చెప్పి గెలిచే కాలం చెల్లింది. కరోనా వచ్చినప్పుడు ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ ముఠా పద్మ ప్రజల మధ్యలో ఉన్నారు. బీజేపీ నేత లక్ష్మణ్ ఇంత వరకు అడ్రస్ లేరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది. వరదలతో నష్టపోయిన వారిని సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని’ కవిత పేర్కొన్నారు.