ఓసి సంక్షేమ సంఘం చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కర‌ణ‌

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వివిధ సంఘాల ఓ సి నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తున్నా రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు, అధికారురులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. రిజర్వేషన్ అమలు కోసం హదరాబాద్ లోని సరూర్ నగర్లో జరిగే ఓసి మహాగర్జన సభలో ఓసీలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, రెడ్డి ఐక్య వేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ విశ్వనాథుల మహేష్ గుప్త, ప్రతినిధులు ప్రసన్న కుమార్, కౌన్సిలర్ శివకృష్ణమూర్తి, బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు రమేష్ ప్రతిభ కౌన్సిలర్ మొటూరి శ్రీకాంత్, ఆర్య వైశ్య యువజన మాజీ అధ్యక్షుడు తృప్తి అనిల్ గోలీ శ్రీనివాస్ గుప్త విశ్వం గుప్తా వైద్య ద్య కిషన్ రావు, పొన్నాల లక్ష్మారెడ్డి, జూకంటి మోహన్ రెడ్డి, జూకంటి ప్రభాకర్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.