కదిలించిన మానవత్వం.. `తోట` ఓదార్యం!

భరతనాట్యం కళాకారిణికు సాయం...

కపిలేశ్వరపురం: కపిలేశ్వరపురం  మండలం తాతపూడి నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి నది తీరాన  కార్తీక వన సమరాధన,ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మండపేట నియోజకవర్గ వైస్సార్ సిపి  కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తణుకు కు చెందిన భరతనాట్యం కళాకారిణి మహాలక్ష్మి ప్రదర్శించిన భరతనాట్యం తోటను కదిలించింది. తండ్రి లేకపోవడంతో ఇద్దరు కుమార్తెలు చదివిస్తూ వారిలో మహా లక్ష్మి కి అద్భుతమైన నటన కౌసల్య వుండడంతో భరతనాట్యం నేర్పించానని ఆమె తల్లి పేర్కొన్నారు. ఎన్నో ఆర్ధికఇబ్బందులు ఉన్న కళలను అభిమానీస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి భరతనాట్యం డిప్లమో చేసేందుకు అవసరమైన రూ 40 వేలు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరగా తక్షణమే స్పందించిన తోట త్రిమూర్తులు రూ 50 వేలు భరత నాట్య కళాకారిణి అందజేశారు. ఈ సందర్భంగా కళాకారిణి మహాలక్ష్మి ఆనంద భాష్పాలతో ఎందరో వేదికలపై హామీలు ఇస్తూ ఉంటారని అయితే తక్షణమే సహాయం అందించి తాను డిప్లమా చేసేందుకు మార్గం చూపించిన తోట త్రిమూర్తులు వంటి నాయకులను జన్మత రుణపడి ఉంటామని కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన నాయి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం ప్రతినిధులను అభినందించారు. భరతనాట్యం చేసిన మహాలక్ష్మి ప్రతిభాపాటవాలను కొనియాడారు. ప్రస్తుత తరుణంలో టివి,సినిమా ల్లో ఎన్నో రకాల నృత్యాలు ఉన్నాయని ఇలాంటి కాలంలో భరతనాట్యం పై మనసుపెట్టి అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించిన కళాకారిణి మహాలక్ష్మి కి నటరాజు ఆశీస్సులు ఉండటం పూర్వజన్మ సుకృతం గా పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా శివుని పై పాడిన పాట తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.రాజకీయ, ఆర్థిక,వ్యాపార వత్తిడి లో ఉండే తాను ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాలు చూసి ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందనని పేర్కొన్నారు. నాయిబ్రాహ్మణుల జాతి రత్నాలు గా  యోగ విన్యాసం చేసిన మరో ఇద్దరిని అభినందించారు. నాట్య కళాకారిణి మహాలక్ష్మి లో ఉన్న ప్రతిభాపాటవాలు ఉన్నత కులంలో పుట్టి ఉంటే ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేదని ఇలా మట్టిలో మాణిక్యాలు మెరుస్తూ ఉంటాయన్నారు. వారిని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరం గా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.