కన్న కొడుకే కాళ‌య‌ముడు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో తల్లిని కొట్టి చంపిన తనయుడు

బీబీన‌గ‌ర్‌: పేగు బంధాన్ని మర్చిపోయి కన్న కొడుకే తల్లిని కొట్టి చంపిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గొల్లగూడెం గ్రామానికి చెందిన‌ ధనమ్మ అనే వృద్ధురాలు తన కుమారుడైన మల్లయ్యతో కలిసి జీవిస్తున్నది. గురువారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన మల్లయ్యకు అన్నం పెట్టకపోవడంతో కోపంతో వృద్ధ తల్లిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు మల్లయ్యని మందలించి వెంటనే వృద్ధురాలిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానయ్య తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.