కరోనాతో ఎంపీ కన్నుమూత

కన్యాకుమారి: తమిళనాడు కన్యాకుమారి లోక్సభ సభ్యుడు వసంతకుమార్ కన్నుమూశారు. వసంతకుమార్ వయస్సు 70 సంత్సరాలు. ఈయన అనారోగ్య కారణాలతో ఈనెల 10 వ తేదీన చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించడంతో ఆయనక్ పాజిటీవ్ అని తేలింది. వసంతకుమార్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.