క‌రోనా: మ‌రో కొత్త ల‌క్ష‌ణం

లండ‌న్‌: గ‌త ఏడాది కాలంగాణ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌లాది మందిని బ‌లితీసుకుంది. తాజాగా క‌రోనా వైర‌స్‌లో మ‌రో కొత్త ల‌క్ష‌ణం బ‌య‌ట‌ప‌డింది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. కొవిడ్ -19 ఇప్పుడు నోటి నుంచి కూడా ఉద్భవించవ‌చ్చు. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న రోగుల సంఖ్య ప్ర‌స్తుతం పెరుగుతున్న‌దని, ఇది నోటి అసౌకర్యంతో బాధపెడుతున్న‌దని ఆయన పేర్కొన్నారు. కరోనా వైర‌స్‌ కొత్త లక్షణానికి కొవిడ్ తుంగ్ అని పేరు పెట్టారు.

ఇప్ప‌టివ‌ర‌కు జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్య వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించేవి. అనంత‌ర కాలంలో రుచి తెలియ‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణం కూడా బ‌ట‌య‌కొచ్చింది. ఇప్పుడు మ‌రో కొత్త ల‌క్ష‌ణం ఉద్భవించింది. కరోనా సోకిన వ్య‌క్తి నోటి లోపల ఇన్ఫెక్షన్ జరుగుతున్న‌ట్లు నిపుణులు గుర్తించారు.

తాజాగా నాలుకపై ఎర్ర‌ని బొడిపెలు రావ‌డంతోపాటు తలనొప్పి, అలసట లేదా అసాధారణ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండాలని స్పెక్టర్ సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ట్వీట్ట‌ర్‌లో షేర్ చేశారు. దీనిలో రోగి నాలుకపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. కరోనా యొక్క కొత్త లక్షణాలలో నోటిలో వింత బొబ్బలు కూడా సంభవిస్తున్నాయని ఆయన తెలిపారు.

situs togel

Leave A Reply

Your email address will not be published.