కరోనా మరో రికార్డ్: 1,501 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వజృంభిస్తోంది. రోజు రోజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో ఆంక్షలు అమలు జరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 15,66 లక్షల టెస్టులు చేయగా 2,61,500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,88,109కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1501 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది.
కొత్తగా 1,38,423 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 1,28,09,643 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 18,01,316 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.