కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ ఇంట్లో సోదాలు

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ నివాసాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. కర్ణాటక, ముంబయితో పాటు ఆయనకు సంబంధమున్న 14 ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ ఆరోపణల మేరకు శివకుమార్‌పై గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్… మనీలాడరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో కొన్ని కేసులను సిబిఐకి బదలాయించింది. శివకుమార్ నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కర్ణాటకలోని సిరా, రాజరాజేశ్వర్ నగర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… నూతనంగా కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు తీసుకున్న శివ కుమార్ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.