కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ రాకెట్ గుట్టు రట్టు

బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎఫ్డీఏ పరీక్ష లీకేజీ రాకెట్ గుట్టును రట్టు చేశారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ వ్యవహారంలో ఏకంగా 14 మందిని అరెస్టు చేశారు. దీంతో ఆదివారం జరగాల్సిన మొదటి డివిజన్ అసిస్టెంట్ పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఇప్పటి లీకేజీ వ్యవహారంలో 14 మందిని అరెస్టు చేశామని, రూ.35లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ జాయింట్ సీపీ సందీప్ పాటిల్ ఆదివారం తెలిపారు.