కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

నంద్యాల: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే నలుగురు మృత్యువాతపడగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం యర్రగుట్ట వద్ద జరిగింది. రహదారిపై 40 మంది నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఐషర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఝాన్సీ (15) అక్కడికక్కడే మృతి చెందగా సుస్మిత (15), వంశీ(10), హర్షవర్ధన్ (10) నంద్యాల ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన తర్వాత వాహనం ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు వెంబడించి ఆళ్లగడ్డ సమీపంలో బత్తులూరు వద్ద ఆతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనతో ఎర్రగుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.