కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ములుగు జెడ్పీ చైర్మన్

ములుగు: ములుగు జిల్లా లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో భాగంగా ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ , ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ లబ్ధిదారులకు గురువారం చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో నివసించే నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన యువతుల పెళ్లిళ్ల కోసం లక్ష నూట పదహారు రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి చేయడం భారంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకురావడం తెలంగాణ బిడ్డ గా గర్విస్తున్నాను అని అన్నారు .ఈ కార్యక్రమం లో మొత్తం 177 చెక్కులు (1కోటి 17లక్షలు రూపాయలు) అందించారు . ఈ కార్యక్రమం లో ములుగు తహశీల్దార్ సూర్య నారాయణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.