కల్యాణ ల‌క్షి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హ‌రీష్‌

దుబ్బాకః దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో 315 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశంలోని 5 రాష్ట్రాలలో కాంగ్రెస్, 12 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటింటికీ తాగునీరు, త్వరలోనే సాగునీరు, నిరుపేదలకు సంక్షేమం కింద ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తున్నది మన రాష్ట్రమే అన్నారు. తెలంగాణ వచ్చాక ఎక్కడ తాగునీటి సమస్య లేద‌న్నారు. తొలి కాన్పు తల్లిగారే చేయాలని ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తున్నది మ‌న తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇచ్చేది టీఆర్ఎస్ సర్కారు. పంటకు అనుకున్న విధంగా గిట్టుబాటు ధర అందించాం. త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతు కాళ్లు కడుగుతాం అని తెలిపారు. దుబ్బాక నియోజక వర్గంలో 57వేల మందికి పింఛన్ ఇస్తున్నది మ‌న ప్ర‌భుత్వం అని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలు డబ్బాల్లో రాళ్లు వేసి ఊపుతున్నారని ఆరోపించారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు, కానీ నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టుగా తెలంగాణ సర్కారు పని చేస్తుంద‌ని తెలిపారు. ఇప్పటిదాకా 7 లక్షల మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 5555 కోట్ల రూపాయలు అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ద‌క్కుతుంద‌ని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.