కల్వర్టును ఢీకొన్న‌ కారు.. నలుగురు మృతి

ప్ర‌కాశం: ఎపిలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగ‌గింది. జిల్లాలోని త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్‌ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన‌వారిగా గుర్తించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.