కవితకు మేనేజ్మెంట్ కోటలో పదవి వచ్చింది: లక్ష్మణ్
హైదరాబాద్: హైదరాబాద్ లో రాజస్థాన్ ,మహారాష్ట్ర, బెంగాల్ కు చెందిన వారు ఎంతోమంది నివసిస్తున్నారు.. అందుకే ఇది ఓ మిని భారతదేశం అని బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలు అన్ని కుటుంబ పార్టీలే, కానీ ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం పని చేస్తున్నారు అని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికే అన్ని పార్టీ పదవులు.. ప్రజాక్షేత్రంలో ఓడించినా మేనేజ్మెంట్ కోటలో కేసీఆర్ కూతురు కవిత పదవులు దక్కించుకున్నారు అని అన్నారు.కేసీఆర్ మనవడు హిమాన్షుకు కూడా వయస్సు ఉంటే పదవి ఇచ్చే వారు. ముస్లింల కోసం ఎంఐఎం ఏమి చేయలేదు. కరోనా సమయంలో పేద ముస్లింల కోసం ఎంఐఎం ఏమి చేయలేదు అన్నారు. హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ లా చేస్తామన్నారు. కానీ కల్లాస్ చేశారు.