కాంగోలో పడవ మునక.. 60 మంది మృతి
కాంగో: ఆఫ్రికా దేశమైన కాంగోలోని నదిలో పడవ మునక ఘటనలో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. ఈ ప్రమాదంలో వందలాది మంది తప్పిపోయారు. మాయి-నోమ్బే ప్రావిన్స్‌లో 700 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో కనీసం 60 మంది మరణించినట్లు అక్కడి మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు. 300 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. నోడామ్బి ప్రావిన్స్ లోని లాంగోలా ఏకోటి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పడవ కిన్షాసా నుంచి భూమధ్యరేఖ ప్రావిన్స్ కు వెళ్తున్నట్టు కాంగో మంత్రి ఎంబికాయి పేర్కొన్నారు. ఓడలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో పడవ మునిగినట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
కాగా “ఇప్పటివరకు 60 మంది ప్రాణములేని మృతదేహాలను వెలికి తీశారు. అలాగే రెస్క్యూ టీం 300 మంది ప్రాణాలను కాపాడింది. ఈ పడవ ధ్వంసమైన తరువాత ఇంకా చాలా మంది తప్పిపోయారు. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఈ ప్రమాదం చోటుచేసకుంది“ అని మంత్రి ఎంబికాయి మీడియాకు చెప్పారు.