కాబుల్‌లో ఇద్ద‌రు సుప్రీంకోర్టు మహిళా జడ్జిలను కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు

కాబుల్‌: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మృతి చెందారు. వారిద్దరూ సుప్రీం కోర్టులో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కోర్టు వాహనంలో తమ కార్యాలయానికి వెళుతుండగా వారిపై దాడి చేసి హ‌త్య చేసిన‌ట్లు కోర్టు ప్ర‌తినిధులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో వాహనం డ్రైవర్‌కు కూడా తూటాలు తగిలాయి. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  కాగా గ‌త కొన్ని నెల‌లుగా రాజ‌కీయ నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, డాక్ట‌ర్లు, న్యాయ‌వాదులు హ‌త్య‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌హిళా న్యాయ‌మూర్తుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు ప్ర‌భుత్వ అధికారులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.