కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన పోచారం

బాన్సువాడ: కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం పరిశీలించారు. జిల్లాలోని బాన్సువాడ పట్టణం, బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, దేశాయిపేట, పోచారం గ్రామాల్లో స్పీకర్ ఇవాళ పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా తాడ్కోల్ గ్రామంలోని అంబేద్కర్ భవనం, బాన్సువాడ పట్టణంలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం దేశాయిపేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. అలాగే పోచారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ మండపాన్ని పరిశీలించారు. పనులు ముందుకు వెళ్లున్న తీరుపై అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులతో స్పీకర్ మాట్లాడారు. ఈ పనుల వేగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే దేశాయిపేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లనిర్మాణ పనులు పూర్తి కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.