కామారెడ్డి జిల్లాలో 434 రిజిస్ట్రేష‌న్లు పూర్తి: క‌లెక్ట‌ర్‌

కామారెడ్డి: ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేయడంలో తెలంగాణలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. దోమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 434 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు 20 నిమిషాల వ్యవధిలోనే మూటేషన్ పూర్తిచేసి పాస్ పుస్తకం నకలు అందజేస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఒక రిజిస్ట్రేషన్ ను తహసీల్దార్ తో చేయించారు. పాస్ పుస్తకం నకలును మహిళా రైతు కు అందజేశారు. లింగుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.17 తేమశాతం వచ్చిన ధాన్యం ను కోనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఎంపీపీ సదానంద, జడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్, తహసిల్దార్ అంజయ్య, ఎంపీడీవో చెన్నారెడ్డి, ఎంపీవో తిరుపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.