కామారెడ్డి: వేస‌విలో నీటి ఎద్ద‌డి లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటాం

ప్ర‌భుత్వ విప్ గంప గోవ‌ర్ధ‌న్‌

కామారెడ్డి: పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన జరిగింది. బడ్జెట్ 2021-22 సంవత్సరానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. పట్టణ రూపురేఖలను మార్చడానికి కృషి చేస్తానని చెప్పారు. పట్టణంలో రెండు జంక్షన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ వద్ద జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అడ్లూర్ రోడ్ నుంచి గుమస్తా కాలనీ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి కి రూ.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు రూపాయలు 42 కోట్లు రుణాలుగా అందించారని చెప్పారు. దేశంలో నెంబర్.1 మున్సిపాలిటీగా కామారెడ్డి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సహకారంతో పట్టణం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్ ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపాలిటీ ముందంజలో ఉండడానికి కృషి చేస్తామన్నారు.కౌన్సిలర్ల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు బడ్జెట్ వివరాలను తెలియజేశారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియా, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.