కారు బోల్తా పడి నవ దంపతులు మృతి

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండల పరిధిలోని లక్ష్మీదేవునిపల్లి వద్ద అతివేగంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నవ దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి ప్రవీణ్(25), రేణుక(24)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.