కూకట్‌పల్లిలో కొడుక్కి నిప్పంటించిన తండ్రి
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సరిగా చదవడం లేదని కొడుకుపై తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. చరణ్ అనే పదేళ్ల బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే కుమారుడు సరిగా చదువుకోవడం లేదని తండ్రి అతనిపై పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. అంతేగాక కొడుకుపై కోపం చల్లారకపోవడంతో ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్‌పై టర్పెంటైల్ పోసి నిప్పంటించి తగలబెట్టాడు. ఒంటినిండా గాయాలవ్వడంతో బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.