కూలిన భవనం.. శిథిలాల్లో 8 మంది

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండి పట్టణంలో వాణిజ్య సముదాయంలో భవనం కూలిపోవడంతో దాదాపు ఎనిమిది మంది చిక్కుకున్నట్లు పౌర అధికారి తెలిపారు. మంకోలి నాకాలోని హరిహర్‌ కాంపౌండ్‌లో ఉదయం 10.30గంటల సమయంలో గోడౌన్‌గా ఉన్న భవనం కూలిపోయిందని థానే పౌర సంఘం ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. గోడౌన్‌లో పని చేస్తున్న ఏడు నుంచి ఎనిమిది మంది శిథిలాల కింది చిక్కుకున్నారని ఆయన తెలిపారు. స‌హాయ‌క సిబ్బంది వారిని వెలికితీసే పనిలో ఉన్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.