కృష్ణానదిలో వలకు చిక్కిన భారీ కొండచిలువ

విజ‌య‌వాడ‌: కృష్ణానదిలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానదిలో జాలర్లు చేపలు పడుతుండగా వలలో 15 అడుగుల కొండచిలువ చిక్కింది. వలను బయటకు లాగిన తర్వాత చూడగా చేపలతో పాటు భారీగా కొండచిలువ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.