కెటిఆర్ పిఎనంటూ మోసం..
నిందితుడి అరెస్టు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కెటిఆర్ పిఎ (వ్యక్తిగత కార్యదర్శి)నంటూ అంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి కెటిఆర్ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నానంటూ కార్పొరేట్ ఆస్పత్రులకు, వ్యాపారులకు ఫోన్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. గతంలో నాగరాజుపై 10 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2014-16 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రంజీ మ్యాచ్ల్లో నాగరాజు ఆడాడు. నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేట గ్రామం.