కెసిఆర్ ఆశయాన్ని ప్రతిబింబించేలా మొక్కలు నాటాలి: కెటిఆర్‌

హైదరాబాద్‌: ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు కానుకగా ఒకే రోజు.. ఒకే గంటలో కోటి మొక్కలను నాటేలా ‘కోటి వృక్షార్చన’ పేరిట హరిత పండుగను నిర్వహించ సంకల్పించింది. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను శనివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. మహమూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీయార్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీయార్ కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, ఎం.పీ సంతోష్ కుమార్ ను కేటీయార్, మంత్రులు అభినందించారు. ఆరేళ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.