కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి
రాష్ట్రపతి, ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఈ పోరు ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీకి వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరారు. హిందీ, ఆంగ్ల భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరించారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.
పీవీ స్మారక స్టాంప్‌కు అనుమతి ఇవ్వండి..
అలాగే రాష్ట్రపతికి రాసిన మరో లేఖలో మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణకు చెందిన ఆయన వివిధ రంగాల్లో తన ప్రతిభను ప్రదర్శించారన్నారు. అనేక ఆర్థిక సంస్కరణలకు ఆధ్యాడిగా నిలిచారని, అలాగే శాస్త్ర సాంకేతిక, మానవ వనరుల విభాగంలోనూ తనదైన ప్రత్యేకను గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీవీ స్మారక తలాపా స్టాంప్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్రం ప్రణాళికకు వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. అలాగే శీతాకాలం సందర్భంగా దక్షిణాది విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో స్టాంప్‌ను ఆవిష్కరించాలని కోరారు.